Nallabelli | సీనియర్ నేత నిరసన..

Nallabelli | సీనియర్ నేత నిరసన..
Nallabelli | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొలిపాక పైడి, పార్టీ అంతర్గత వ్యవహారాల పై ఆవేదన వ్యక్తం చేశారు. గత 23 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా ఉన్నానని గుర్తు చేశారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల్లోనే ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేశానని ఆయన తెలిపారు. ఇటీవల కొంతమంది కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తులు ప్రభుత్వ పథకాల పేరిట ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడం, పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని వైడి పేర్కొన్నారు.
“ఇలాంటి అక్రమ విధానాలను ప్రశ్నించినందుకు నా పై తప్పుడు ఆరోపణలు చేసి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం విచారకరం” అని ఆయన అన్నారు. తాను ఎల్లప్పుడూ పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తూనే ఉంటానని అన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నారక్కపేట గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీకి మెజార్టీ సాధించడంలో కీలక పాత్ర పోషించినట్టు పైడి గుర్తు చేశారు.
