బండి భగీరథ కోసం గాలింపు..
బండి భగీరథ కోసం గాలింపు..
- కేంద్ర మంత్రి నివాసంలో సోదాలు
కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ ; ఫోక్సో కేసులో నిందితుడు బండి భగీరత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కేంద్ర మంత్రి నివాసంలో సిపి గౌస్ ఆలం ఆదేశాల మేరకు టూ టౌన్ ఇన్స్పెక్టర్ సుజన్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు బృందాలు బండి భగీరథ కోసం గాలింపు చర్యలు చేపట్టారని పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు. నిన్న భగీరథకు హైకోర్టులో మద్యంతర బెయిల్ కోసం విచారణ జరగగా న్యాయమూర్తి వారం రోజులకు వాయిదా వేసిన విషయం విధితమే.
