పది ఫలితాల్లో కేజీబీవీ పాఠశాలలో 100% ఉత్తీర్ణత…..
పది ఫలితాల్లో కేజీబీవీ పాఠశాలలో 100% ఉత్తీర్ణత…..
రేగొండ, ఆంధ్రప్రభ : బుధవారం వెలువడిన పది ఫలితాల్లో రేగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. కేజీబీవీ విద్యార్థులు పది ఫలితాలలో హిందూజ. 538/600, పి. శ్రావ్యా 538/600, ఎం. సు హసిని. 534/600, 500 పైన ఏడుగురు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు.
అదేవిధంగా పదో తరగతిలో 41 మంది విద్యార్థులు ఉండగా విద్యార్థులందరూ 100% ఉత్తీర్ణత సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ మనోరమ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన బాలికలను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.
