సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ..
క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : సింగరేణి ఏరియా ఆస్పత్రి, రామకృష్ణాపూర్‌లో వైద్య సేవల తీరును పరిశీలించేందుకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) డా. ఆర్. కిరణ్ రాజ్ శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
తనిఖీలో భాగంగా క్యాజువాలిటీ, ఓపీ విభాగం, వివిధ వార్డులు, ల్యాబొరేటరీతో పాటు ఇతర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రిలో పరిశుభ్రత, మందుల లభ్యత, రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి నిర్వహణ తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమైన సీఎంఓ, ఆస్పత్రిలో తలెత్తుతున్న సమస్యలు, మెరుగుపరచాల్సిన అంశాలపై చర్చించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
అలాగే ప్రతి రోగితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంఓ మధుకుమార్, సీనియర్ పీఓ మదర్ సాహెబ్, మ్యాట్రన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
