Deal OK : భారత్ కు ఎఫ్-35 ఫైటర్ జెట్స్ ను విక్రయిస్తాం – డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్‌ – ఇండియాతో అద్భుతమైన ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో కలిసి వైట్‌ హౌస్‌ లో అమెరికా అధ్యక్షుడి తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి అంశాలపై దేశాధినేతలు చర్చించుకున్నారు. అనంతరం వీరిద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఇండియాకు ఎఫ్-35 ఫైటర్ జెట్స్ని విక్రయించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు.”ఈ ఏడాది నుంచి భారత్ కు మిలిటరీ సేల్స్ ను భారీగా పెంచుతున్నాము. ఇండియాకు ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ని విక్రయిస్తాము,” అని చెప్పుకొచ్చారు.ఈ ఎఫ్-35.. ప్రపంచ డిఫెన్స్ చరిత్రలోనే అత్యాధునిక, స్టేట్-ఆఫ్- ఆర్ట్ జెట్గా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే, భారత్కు ఇంతకాలం వీటిని విక్రయించకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది! డిఫెన్స్ విషయంలో ఇండియాకు రష్యాతో సత్ససంబంబంధాలు ఉన్నాయి. రష్యాను అమెరికా శత్రువుగా చూస్తుందన్న విషయం తెలిసిందే. భారత్కు ఫైటర్ జెట్స్ విక్రయిస్తే, ఈ టెక్నాలజీని ప్రత్యర్థులు దొంగలిస్తారేమో అని అమెరికా ఇంతకాలం ఆందోళనపడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఇండియాకి ఎఫ్-35 ఫైటర్ జెట్స్ని విక్రయించేందుకు సిద్ధమైంది.

ఇక నున్న రోజుల్లో ఇండియాతో అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామని ప్రకటించారు.”ఇండియా మా నుంచి చాలా చాలా చమురు- గ్యాస్ని కొనుగోలు చేస్తుంది. రానున్న కాలంలో ఇండియాతో అనేక అద్భుతమైన ట్రేడ్ డీల్స్ చేసుకుంటాము,” అని ట్రంప్ అన్నారు.”ఇండో-పెసిఫిక్ ప్రాంతంలో శాంతిని కొనసాగించేందుకు అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాలు కలిసి ఉండాలని ఈ సమావేశంలో నేను మోదీ నిర్ణయించాము,” అని ట్రంప్ అన్నారు.

భారత్- అమెరికా దేశాలు సంయుక్తంగా తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేసి 500 బిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయని నరేంద్ర మోదీ ప్రకటించారు. రెండు దేశాలు త్వరలోనే పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందంపై పనిచేస్తాయని తెలిపారు.

భారత్‌ది తటస్థ వైఖరి కాదు..

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలపైనా మోదీ మాట్లాడారు. ”యుద్ధం విషయంలో భారత్‌ది తటస్థ వైఖరి కాదు. మేం శాంతి వైపు నిలబడతాం. ఇది యుద్ధాల శకం కాదని ఇదివరకే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చెప్పా. ఉద్రిక్తతలను ఆపడానికి ట్రంప్‌ తీసుకుంటున్న చర్యలకు మద్దతిస్తున్నా” అని మోదీ వెల్లడించారు.

మనం కలిస్తే మెగా:

మోదీట్రంప్‌ ఎన్నికల ప్రచార సమయంలో ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ (MAGA)’ అనే నినాదాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు. దీనినుంచి స్ఫూర్తి పొందుతూ తాను కూడా ‘మేక్‌ ఇండియా గ్రేట్‌ అగైన్‌ (MIGA)’ నినాదం ఇస్తున్నట్లు మోదీ ఈసందర్భంగా తెలిపారు. MAGA, MIGA కలిస్తే ‘మెగా’ భాగస్వామ్యం అవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

అక్ర‌మవ‌ల‌స‌దారులంద‌ర్ని స్వదేశానికి తీసుకొస్తాం .. మోదీ

అక్రమ వలసదారుల అంశంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నారు. అమెరికా లో అక్రమంగా నివసిస్తున్న 104 మంది భారతీయులను ఇటీవల అగ్రరాజ్యం తిప్పి పంపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వాళ్ల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయడం వివాదాస్పదమైంది. ఈ పరిణామాల వేళ ట్రంప్‌తో భేటీ అయిన మోదీ వలసదారుల అంశంపైనా చర్చించారు. ”యువత, పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులు గా మారుతున్నారు. డబ్బు, ఉద్యోగాల ఆశజూపి కొంతమంది వీరిని మోసం చేస్తున్నారు. అలా వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారు. వారికి తెలియకుండానే మానవ అక్రమరవాణా కూపంలోకి వెళ్తున్నారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాల్లో భారత్‌కు ట్రంప్‌ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం” అని మోదీ వెల్లడించారు.

మనం కలిస్తే మెగా – మోదీ.

మోదీ ట్రంప్‌ ఎన్నికల ప్రచార సమయంలో ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ (MAGA)’ అనే నినాదాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు. దీనినుంచి స్ఫూర్తి పొందుతూ తాను కూడా ‘మేక్‌ ఇండియా గ్రేట్‌ అగైన్‌ (MIGA)’ నినాదం ఇస్తున్నట్లు మోదీ ఈసందర్భంగా తెలిపారు. MAGA, MIGA కలిస్తే ‘మెగా’ భాగస్వామ్యం అవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

ట్రంప్ కు అపురూప‌మైన గిఫ్ట్ ..

భారత ప్రధానికి ట్రంప్ ప్రత్యేక బహుమతి అందజేశారు. తాను స్వయంగా రాసిన ‘అవర్‌ జర్నీ టుగెదర్‌’ అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న కీలక సందర్భాలు, ప్రధాన ఈవెంట్లతో కూడిన ఫొటోబుక్‌ ఇది. ఇందులో ప్రధాని మోదీ 2019 నాటి అమెరికా పర్యటనలో నిర్వహించిన ‘హౌడీ మోదీ’, ఆ తర్వాత 2020లో ట్రంప్‌ భారత్‌కు విచ్చేసినప్పుడు ఏర్పాటుచేసిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకంపై ‘మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌, యూ ఆర్‌ గ్రేట్‌’ అని రాసి ట్రంప్‌ సంతకం చేశారు. అనంతరం పుస్తకంలోని పేజీలను తిప్పుతూ వీరిద్దరూ ఉన్న ఫొటోలను మోదీకి ఆయన చూపించారు.

ఇండియాకు తహావుర్ రాణా..

26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహావుర్ రాణాని భారత్కు పంపించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ప్రధానమంత్రి మోదీతో భేటీ అనంతరం జరిగిన సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

భార‌త్ కు మోదీ ప‌య‌నం …

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. దీంతో ఆయన అమెరికా నుంచి భారత్ కు నేటి ఉద‌యం తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నెల 12, 13 తేదీల్లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, తులసీ గబ్బార్ఢ్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ , వివేక్ రామస్వామి తదితరులతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. అంతకుముందు ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో పర్యటించారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *