వన సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
- ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి, ఆంధ్రప్రభ: పర్యావరణ పరిరక్షణకు చెట్ల పెంపకం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి ప్రభాకర్, జిల్లా అటవీ అధికారి నవీన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మొక్కల పెంపకం వల్ల పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటి వాటి సంరక్షణపై అవగాహన కల్పించారు. జిల్లావ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులు కోరారు.
