విధుల్లోనే విషాదం…

జైపూర్, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో వాణిజ్య పన్నుల శాఖకు చెందిన సీనియర్ ఇన్‌స్పెక్టర్ మృతి చెందిన ఘటన జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, సీసీసీ నస్పూర్ కాలనీకి చెందిన అలపురి అనురాగ్ (35) వాణిజ్య పన్నుల శాఖలో సీనియర్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి ఆయన ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద విధుల్లో ఉండగా, అనుపమ్ కుమార్ అనే కారు డ్రైవర్ (TS09EL9677) అతివేగంగా వాహనం నడపడంతో అనురాగ్‌ను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో అనురాగ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జైపూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
