apcm deputy cm ఓకే .. అలాగే చేద్దాం Andhra Prabha News

apcm deputy cm ఓకే .. అలాగే చేద్దాం Andhra Prabha News

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్ష

జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై చర్చ

మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యం

వేసవిలో డ్రెయినేజ్ పూడికతీతకు ఆదేశాలు

అటవీ శాఖ హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలు

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సమాలోచనలు

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెల‌గ‌పూడి ప్ర‌తినిధి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఉద‌యం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ శాఖ అంశాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై వీరిద్ద‌రి మ‌ద్య చర్చ జ‌రిగింది. ⁠

రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రెయిన్స్ నిర్మించడం ద్వారా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు నీటిపారుదలశాఖ పరిధిలోని డ్రెయినేజ్ ల్లో పూడిక తీత అంశాన్ని ప్రస్తావించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేసవిలో పూడిక తీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను సీఎం చంద్ర‌బాబుకు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వివ‌రించారు. అసెంబ్లీ సమావేశాల‌ సమయంలోపై పలు అంశాలపై మాట్లాడుకోవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాల‌యంలో డిప్యూటీ సీఎం క‌లిశారు.