సినీ, నాటక రంగాలకు ఎనలేని సేవలు
పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రియ కళాక్షేత్రం ఆవరణలో ప్రముఖ నాటక, సినీ కళాకారులు పువ్వుల సూరిబాబు, రాజేశ్వరి దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ పువ్వుల సూరిబాబురాజేశ్వరి దంపతులు సినీ, నాటక రంగాలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
