21Hang 4k arrest : ఇరాన్ లో 21 మందికి ఉరి Andhra Prabha Top News
21Hang 4k arrest : ఇరాన్ లో 21 మందికి ఉరి Andhra Prabha Top News
- 4000 మంది అరెస్టు
- యుద్ధం కంటే ఘోరం
- ఇదీ ఇరాన్‌లో అంతర్గత హింస
- ఐక్యరాజ్యసమితి ఆందోళన
(ఆంధ్రప్రభ, వాషింగ్టన్ ప్రతినిధి )
21Hang 4k arrest : అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆఫరేషన్ ఎథిక్ ప్యూరీ ఫలితంగా… ఇరాన్ లో పైకి కనిపించని అంతర్గత హింస మితి మీరిపోతోందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడికి ముందు ఇరానీ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధిపోరాటాలకు దిగితే.. ఐఆర్జీసీ దళాలతో ప్రభుత్వం ఆందోళనలపై ఉక్కుపాదం మోపటమే కాదు.. తీవ్రాతి తీవ్రంగా అణచి వేసింది. తాజాగా..అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ అగ్రనాయకత్వం అంతం కావటంతో.. దేశ ప్రజల్లో దేశభక్తి రగిలింది. అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో ప్రభుత్వం కూడా తమ వ్యతిరేక వర్గాలను తుడిచేస్తున్నారు. ఇప్పటి వరకూ 21 మందిని ఉరి తీశారు. 4000 మందిని .జైళ్లల్లో కుక్కారు. ఇదే అంశాన్ని ఐక్యరాజ్యసమితి నివేదించింది.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్‌లో శిక్షాత్మక చర్యలు తీవ్రంగా పెరిగాయని, కనీసం 21 మరణశిక్షలు మరియు 4,000కు పైగా అరెస్టులు నమోదయ్యాయని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం నివేదించింది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం, జనవరిలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న 9 మందికి, ప్రతిపక్షానికి చెందిన 10 మందికి మరణ శిక్ష విధించారు. గూఢచారులుగా అనుమానించి మరో ఇద్దరికి ఉరిశిక్ష వేశారు. ఇక ఆందోళనల్లో పాల్గొన్న 4000 మందిని ఖైదీలుగా బంధీంచారు.
21Hang 4k arrest : యురేనియం అక్కడే

అత్యధిక సుసంపన్న యురేనియం ఇప్పటికీ ఇరాన్ ఇస్ఫహాన్ కేంద్రంలోనే ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి అణు విభాగం అధిపతి అనుమానం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) అధిపతి ప్రకారం, పదేపదే వైమానిక దాడులు జరుగుతున్నప్పటికీ, ఇరాన్ అత్యధిక సుసంపన్న యురేనియం ఇప్పటికీ ఇస్ఫహాన్ అణు కేంద్రంలోనే నిల్వ ఉండే అవకాశం ఉంది. గత సంవత్సరం ఈ కేంద్రంపై భారీగా బాంబు దాడులు జరిగాయి . ఇటీవలి అమెరికా-ఇజ్రాయెల్ సంఘర్షణ సమయంలో తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, అదనపు దాడులను ఎదుర్కొంది. ఐఏఈఏ అధిపతి రాఫెల్ గ్రోస్సీ మాట్లాడుతూ, ఇటీవలి దాడుల ప్రభావాన్ని చూపే ఉపగ్రహ చిత్రాలను తమ సంస్థ విశ్లేషిస్తోందని, నష్టం పరిధి, ఇరాన్ అణు పదార్థాల స్థితి గురించి సమాచారాన్ని సేకరిస్తూనే ఉందని తెలిపారు.
ALSO READ : 154 Ships : ఇరాన్ గుప్పెట్లో…Andhra Prabha Top Story
