కొండవీడులో విషాదం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

యడ్లపాడు , ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లా,యడ్లపాడు మండలం, కొండవీడు గ్రామానికి చెందిన కట్టా ఇజాక్ వెస్లీ పాల్ (ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి,నారాయణ జూనియర్ కళాశాల, గుంటూరు) కళాశాల నుండి హోమ్ సిక్‌ సెలవులపై సుమారు నాలుగు రోజుల క్రితం స్వగ్రామమైన కొండవీడుకు వచ్చాడు. ఈ రోజు ఉదయం సుమారు 7.00 గంటల సమయంలో, తన ఇంటి పక్కన ఉన్న దుకాణంలో పైకప్పుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబ సభ్యులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. మృతుడు చదువులో ఆశించిన స్థాయిలో రాణించలేక మానసికంగా మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. అయితే, ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడి తండ్రి థామస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది అని ఎస్ఐ టి.శివరామకృష్ణ తెలియజేశారు.