Amit Shah | బెంగాల్‌లో బీజేపీకి 110 సీట్లు

Amit Shah | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమిత్ షా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలి విడత పోలింగ్ అనంతరం బీజేపీ భారీ విజయాన్ని సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మొదటి విడతలో 152 సీట్లకు గాను బీజేపీ 110 సీట్లు గెలుచుకుంటుందని అమిత్ షా తెలిపారు. బెంగాల్ ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారని, ఈసారి ప్రజాభిప్రాయం పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు.

అపూర్వమైన ఉత్సాహంతో, ఆవేశంతో ప్రజలు ఓటు వేశారని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది.

Leave a Reply