42degrees | ఏపీ, టీజలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

42degrees | ఏపీ, టీజలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
42degrees |ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే ఎండ తీవ్రంగా ఉంటుండటంతో జనం బయటకు రావడం కష్టంగా మారింది. తెలంగాణలో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో సుమారు 41°C వరకు నమోదైంది. రామగుండం, నిజామాబాద్ ప్రాంతాల్లో 42–43°C వరకు చేరింది.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేడి తీవ్రత అధికంగా ఉంది. విజయవాడలో 42డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 41–43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమ ప్రాంతాల్లో అయితే మరింత ఎండ దంచికొడుతోంది. ఇంకా 3–4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
అయితే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి, కోనసీమ, రాజమండ్రి, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వానలు దంచి కొడుతున్నాయి. దీంతో మమాడి తోటలు దెబ్బతిన్నాయి. వరి పంటలు నేలవాలాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
