Tirumala Darshan | అభిషేక సేవలో పాల్గొన్న ముకేశ్ అంబానీ

Tirumala Darshan | అభిషేక సేవలో పాల్గొన్న ముకేశ్ అంబానీ

Tirumala Darshan | ఆంధ్రప్రభ, తిరుమల: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధిక అంబానీతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్న అంబానీ కుటుంబానికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

ఇదిలా ఉండగా, నేడు తిరుపతిలో కూటమి ప్రభుత్వ భారీ సభ నిర్వహణ నేపథ్యంలో తిరుమలలో వీఐపీల రద్దీ గణనీయంగా పెరిగింది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన సాధారణ భక్తులు ఎక్కువసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీటీడీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు సుమారు 18 గంటల వరకు వేచిచూడాల్సి వస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply