గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి..

గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి..

మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందారు. మిర్యాలగూడ పట్టణంలోని ​కలాల్‌వాడలో గల ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఇంట్లో ఉన్న చంద్రమ్మ(50), మనవడు లక్ష్మణ్ (17), మనవరాలు ప్రణతి(14) లు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసి మృతదేహాలను వెలికి తీశారు. అలాగే డీఎస్పీ రాజశేఖర్ రాజు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ​పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.