గంజాయి ముఠా పట్టివేత

- ముగ్గురు అరెస్టు..
- 2,250 కిలోలు స్వాధీనం
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : ఒడిశా నుంచి అక్రమంగా గంజాయిని నంద్యాల జిల్లాకు తీసుకు వస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గుర్ని అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూర్ జండా రాచ వీధికి చెందిన వంశీ ప్రస్తుతం కర్నూలు పట్టణంలోని అరుంధతి నగర్ లో నివసిస్తున్నాడు. డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
ఈ నెల 26 న ఒడిశా బర్హంపూర్ కు చెందిన నీలాంచల్ పట్నాయక్ అనే వ్యక్తి రూ. 16 వేలు పంపాడు. నీలాంచల్ పట్నాయక్ నుంచి 2. 250 కేజీల గంజాయిని తీసుకోవాలని బొల్లవరం గ్రామానికి చెందిన వాకిటి శ్యామ్ ప్రసాద్ ను వంశీ సూచించాడు.
ఈ మేరకు శ్యామ్ ప్రసాద్ రాత్రి రైలులో ఒడిశా నుంచి విజయవాడకు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆర్టీసీ బస్సులో దోర్నాలకు వచ్చాడు. అక్కడ నుంచి ప్రైవేట్ గూడ్స్ వాహనంలో బొల్లవరం గ్రామానికి చేరుకున్నాడు. నందికొట్కూరు పట్టణానికి చెందిన దూదేకుల మహమ్మద్ రఫీక్, సహా ముగ్గురు 2.250 కేజీల గంజాయిని తరలిస్తుండగా బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లవరం గ్రామానికి సమీపంలో జాతీయ రహదారిపై నందికొట్కూర్ రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం , బ్రాహ్మణకొట్కూర్ ఎస్ ఐ పి తిరుపాలు ఈ నిందితులను అదుపులోనికి తీసుకున్నారు..
బ్రాహ్మణకొట్కూర్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ తిరుపాలు సిబ్బంది ని జిల్లా ఎస్పీ అభినందించారు. గంజాయి, మట్కా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం హెచ్చరించారు.
