20-20-20 Rule | మీరు చేసే ఈ చిన్న తప్పు.. కంటికి శాపం!

20-20-20 Rule | మీరు చేసే ఈ చిన్న తప్పు.. కంటికి శాపం!

20-20-20 Rule | స్క్రీన్‌ల వల్ల కళ్లపై పెరుగుతున్న ఒత్తిడి
డిజిటల్‌ ఐ స్ట్రెయిన్‌ అంటే ఏమిటి?
20-20-20 రూల్‌ను ఎలా పాటించాలి?
ఈ రూల్‌ వల్ల కలిగే ప్రయోజనాలు
కళ్ల ఆరోగ్యానికి చిన్న అలవాట్లు.. పెద్ద ప్రయోజనాలు

20-20-20 Rule | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన కళ్లు ఎక్కువగా చూసేది ఏమిటి? అంటే ఠక్కున వచ్చే సమాధానం.. మొబైల్‌, టీవీ లేదా కంప్యూటర్‌. పెరిగిన టెక్నాలజీతో ప్రతి పనికీ ఫోన్‌ ఉపయోగించడం, ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్‌ ముందు పని చేయడం వల్ల మన కళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. తరచూ కళ్లు మంటపట్టడం, తలనొప్పి, చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

ఇలాంటి సమస్యల నుంచి కళ్లను కాపాడుకోవడానికి వైద్యులు సూచిస్తున్న సులభమైన పద్ధతే 20-20-20 రూల్‌. చాలా మందికి స్క్రీన్‌ చూస్తున్నప్పుడు కళ్లు ఎందుకు అలసిపోతాయో తెలియదు. మనం మొబైల్‌ లేదా కంప్యూటర్‌ స్క్రీన్‌ను ఎక్కువసేపు చూస్తున్నప్పుడు రెప్పవేయడం తగ్గిపోతుంది. దీంతో కళ్లు పొడిబారడం, మంటగా అనిపించడం, అలసట రావడం వంటి సమస్యలు వస్తాయి. దీనినే డిజిటల్‌ ఐ స్ట్రెయిన్‌ అని అంటారు.

20-20-20 రూల్‌ ఎలా పాటించాలి?

ప్రతి 20 నిమిషాల స్క్రీన్‌ వర్క్‌ తర్వాత చిన్న బ్రేక్‌ తీసుకోవాలి. ఆ సమయంలో సుమారు 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. ఇలా చేయడం వల్ల దగ్గరగా ఉన్న స్క్రీన్‌పై నిరంతరం ఫోకస్‌ చేసే కంటి కండరాలకు కొంత విశ్రాంతి లభిస్తుంది.

కంప్యూటర్‌, మొబైల్‌, ట్యాబ్‌ వంటి స్క్రీన్‌లను ఎక్కువసేపు చూస్తూ ఉండటం వల్ల కంటి కండరాలు అలసిపోతాయి. దూరంగా ఉన్న వస్తువును చూడటం ద్వారా ఆ కండరాలు రిలాక్స్‌ అవుతాయి. దీని వల్ల కంటి అలసట తగ్గడమే కాకుండా, తలనొప్పి, కళ్ల మంట, పొడిబారడం వంటి సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే పెద్ద పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేర్చుకుంటే చాలు. పనిలో పడి కళ్లను నిర్లక్ష్యం చేయకుండా, ప్రతి రోజూ 20-20-20 రూల్‌ను పాటించడం మంచిది. స్క్రీన్‌ వర్క్‌ ఎక్కువగా చేసే వారు ఈ అలవాటును తప్పనిసరిగా తమ రోజువారీ పనిలో భాగం చేసుకోవాలి.

Leave a Reply