Mothkur | జర్నలిస్టు షాకీర్ ని సన్మానించిన విప్ బీర్ల అయిలయ్య

Mothkur | జర్నలిస్టు షాకీర్ ని సన్మానించిన విప్ బీర్ల అయిలయ్య

మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన జర్నలిస్టు ఎం.డి. షాకీర్‌ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శనివారం ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనను కలిసిన జర్నలిస్టు షాకీర్ శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం తన పుట్టినరోజు కూడా కావడంతో ఎమ్మెల్యే అయిలయ్య జర్నలిస్టు షాకీర్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ పరస్పరం అభినందనలు తెలుపుకుని ఆత్మీయంగా ముచ్చటించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply