నూతన ఆలయంలో పూజలు చేసిన సర్పంచులు

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని చిట్యాల్ గోండుగూడ గ్రామంలో ఆదివాసి పేందూర్ వంశస్తుల కులదైవమైన హెర్సపెన్ జల్దేవర నూతన ఆలయం సోమవారం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా చిట్యాల్ గ్రామ సర్పంచ్ చీమల భీమేష్ ఆధ్వర్యంలో నిర్మల్ డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు తుమ్మల మల్లేష్, ధర్మాజీపేట్ సర్పంచ్ వడ్నాల శిరీష సత్యం, లక్ష్మీసాగర్ సర్పంచ్ బి. రాజు నాయక్, మద్దిపడగ మాజీ సర్పంచ్ జడ రాజమణి, ఇందూర్ చిట్యాల్ ఉపసర్పంచ్ తుడసం భగవంతరావు, చిట్యాల్ పేందూర్ వంశీయులు పటేల్ పేందూరు లింభారావు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, జీపీ వార్డు సభ్యులు, గ్రామస్తులు మరియు గోండుగూడెం గిరిజనులు పాల్గొన్నారు.
