TG | ఇద్దరు కుమారులకు ఉరి వేసి.. తండ్రి కూడా…

TG | ఇద్దరు కుమారులకు ఉరి వేసి.. తండ్రి కూడా…

TG | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఐదు, మూడు సంవత్సరాల వయసున్న తన ఇద్దరు కుమారులకు ఉరివేసిన తండ్రి, అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

తొర్రూర్ మార్కెట్ ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరివేసుకుని షావలి (35) మృతి చెందినట్లు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ముందుగా తన ఇద్దరు చిన్నారులకు ఉరివేసి, అనంతరం ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ పరిస్థితులు, ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply