ఘనంగా వెటర్నరీ డాక్టర్ల వీడ్కోలు, స్వాగత సన్మాన సభ..

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి ప్రాథమిక పశువైద్య కేంద్రంలో బుధవారం వెటర్నరీ డాక్టర్ల కు వీడ్కోలు, స్వాగతం సభ నిర్వహించారు. బదిలీపై వెళ్తున్న పశువైద్యులు డాక్టర్ ధన్‌రాజ్‌కు సిబ్బంది, ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు.దండేపల్లి పశువైద్య కేంద్రానికి నూతనంగా బదిలీపై వచ్చిన పశువైద్యులు డాక్టర్ సుజాత,డాక్టర్ రాజుకుమార్ లను ఘనంగా ఆహ్వానిస్తూ సన్మాన సభను నిర్వహించారు.​ఈ కార్యక్రమంలో పశువైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ భూమన్న, వెటర్నరీ అసోసియేషన్ అధ్యక్షురాలు విజయభారతి, పశువైద్య శాఖ సిబ్బంది, రైతులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.