The Paradise | శ్రీకాంత్ ఓదేల స్కెచ్ మామూలుగా లేదుగా..

The Paradise | శ్రీకాంత్ ఓదేల స్కెచ్ మామూలుగా లేదుగా..
The Paradise | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దసరా సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తెలుగు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని ఒక భారీ మల్టీవర్స్‌కు స్కెచ్ వేస్తున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో ఆయన తెరకెక్కిస్తున్న ‘పారడైజ్’ సినిమా చుట్టూ ఇప్పుడు ఒక షాకింగ్ రూమర్ ఫిలిం నగర్ వర్గాల్లో తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ముగింపులో వచ్చే ఆ ఒక్క ట్విస్ట్.. టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెన్సేషన్ కాబోతోందనే టాక్ వినిపిస్తోంది. ట్వీస్ట్ తో పాటు ఓ మెగా హీరో ఎంట్రీ కూడా ఉండబోతుందని సమాచారం.
శ్రీకాంత్ ఓదెల ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే చిరు సినిమాకి నాని పారడైజ్ సినిమాకు లీక్ ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాని పారడైజ్ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాన్ని భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా చివర్లో భారీ ట్వీస్ట్‌తో చిరు ఎంట్రీ ఉంటుందని టాక్.. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి.

శ్రీకాంత్ ఓదెల కేవలం ఈ రెండు సినిమాలతోనే ఆపడం లేదు. ‘పారడైజ్’ కంటే ముందే ఏం జరిగిందనే కథతో ఒక ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారట. అంటే ఒక భారీ కాన్సెప్ట్‌తో టాలీవుడ్‌లో సరికొత్త సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేయడానికి ఈ యంగ్ డైరెక్టర్ సిద్ధమయ్యాడని అర్థమవుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న ఈ లీక్డ్ మ్యాటర్ చూస్తుంటే.. నాని, చిరంజీవి ఫ్యాన్స్‌కు ఫుల్ మిల్స్ విందు ఉండదని క్లియర్ గా తెలుస్తోంది. మరి ఈ మెగా-నాని కనెక్షన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
