వెలగపూడి – ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల చేపట్టిన ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంపై జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. గిరిజనులతో పవన్ మమేకం అవడం, వాళ్లతో కలిసి నృత్యం చేయడాన్ని వీడియోలో చూపించారు.
మూడు రోజుల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని జనసేనాని ప్రారంభించారు. గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్లతో పాటు పాఠశాలలు, తాగునీటి సౌకర్యం, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఈ పథకం కింద రూ. 1,005 కోట్లతో 1,069 కిలోమీటర్ల మేర 625 గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంతో గిరిజన గ్రామాలకు మహర్ధశ పట్టనుంది. దీంతో పవన్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
AP | పవన్ కల్యాణ్ “అడవి తల్లి బాట”పై వీడియో రిలీజ్ …
