సీతారాముల దాంపత్యం అజరామరం..

సీతారాముల దాంపత్యం అజరామరం..

తిరువూరు, ఆంధ్రప్రభ : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో ఆయన సీతారాముల పవిత్ర దాంపత్యం లోకకళ్యాణానికి ప్రతీకగా నిలిచిందని, అనేక త్యాగాలతో నిలిచిన ఆ దివ్య బంధం తరతరాలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

శ్రీరాముడు, సీతాదేవి ఆశీస్సులు రాష్ట్ర ప్రజల పై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, శాంతి సమృద్ధులతో జీవించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. సమాజంలో ధర్మం, న్యాయం, నీతి విలువలు పెంపొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకను ప్రజలందరూ ఐక్యంగా, ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.