ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం వేడుకలు..

ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం వేడుకలు..

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మండల వ్యాప్తంగా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జరగబోయే కల్యాణ వేడుకలను తిలకించాలని, సీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ పెద్దలు గౌరిశెట్టి శ్రీనివాసరావు, అబ్బునాగేశ్వరరావు, తాళ్లపల్లి రామ్మూర్తి, నరెడ్ల వెంకన్న, తెలగాని శ్రీనివాస్, బూరుగడ్డ రాములు, అనుమోల వెంకటేశ్వరరావు, సంక ప్రభాకర్ కిరణ్, నువ్వుల నరసింహారావు, అనుమొల వెంకటేశ్వరరావు మర్కొడు, తాళ్ళపల్లి నాగేశ్వరరావు, యశ్వంత్ ట్రేడర్స్, వగలబోయిన సతీష్ ఉప సర్పంచ్, బూర్ణ రాంబాబు, రణం నారాయణ, కొమరం హనుమంతు రావు, కొమరం వెంకన్న తాటికొండ వెంకటాచారి, పొదిల రాము, సుబ్బారావు, మల్లిఖార్జున్లు అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దశావతారాల్లోని ఏడోవతారంగా శ్రీరాముడు జన్మించాడని, మానవ రూపంలో పుడమిపై అవతరించి ధర్మసంస్థాపన చేశాడని, శ్రీరాముడు వసంతరుతువులో చైత్రశుద్ధ నవమి రోజున త్రేతాయుగంలో జన్మించాడని, రాముడు పుట్టిన రోజు వేడుక, పట్టాభిషిక్తుడైన వేడుక ఒకే రోజున కావడంతో జన్మోత్సవం, కళ్యాణోత్సవం వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు. లోకంలో ఎవరికీ లేని 16 సుగుణాలన్నీ ఒక్క శ్రీరాముడికే ఉన్నాయని, ధర్మానికి ప్రతిరూపుడని, ఆయన పాలన రామరాజ్యంగా ప్రజ్వరిల్లిందని పేర్కొన్నారు. గుణవంతుడు, విద్యావంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యభాషి, ఒధృఢ, నిష్ట, సదాచార, సర్వభూతహిత, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు, మనోనిగ్రహం కలవాడు, అసూయ, క్రోధలేనివాడు, రణ భయంకరుడు, కాంతిమంతుడు అందుకే రాముడ్ని సకల గుణ సంపన్నుడిగా అభివర్ణిస్తారని వారు కొనియాడారు.

శ్రీరామ నవమి వేడుకల కోసం స్థానిక రాములోరి ఆలయాలు ముస్తాబైంది. ఆళ్లపల్లి మండలంలోని మర్కోడు అనంతోగు ఆళ్లపల్లి తదితర గ్రామాలలో లక్ష్మణ సమేత సీతారాముల మూర్తులతో కొలువైన ఆలయంలో ప్రతీ ఏటా రాములోరి కళ్యాణం కమణీయం జరుగుతుందని, ఈ శుభ సందర్భాన వేలాదిగా భక్తులు అత్యధికంగా తరలి రావాలని మొక్కులు చెల్లించుకోవాలని వారు సూచించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు సీతారాముల కళ్యాణానికి ఆలయాన్ని నిర్వాహకులు లక్ష్మణాచారి ఆధ్వర్యంలో ఆలయం సుందరంగా ముస్తాబు చేయడమే కాకుండా, ఎండ తీవ్రత పెరిగినందున భక్తులకు చలువ పందిళ్ళును వేశారు. కళ్యాణం అనంతరం పంపిణీ చేసేందుకు అలాగే తీర్థ ప్రసాదాలు పంపిణీ సిద్ధం చేశారు. వేసవిలో దాహార్తితీర్చేందుకు మంచినీటి సౌకర్యం కల్పించారు. శుక్రవారం ఉదయం 11:35 గంటల నిమిషాలకు పునర్వాసు నక్షత్ర యుక్త మిథున్ అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తం సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.

Leave a Reply