AP | నిరుపేద మహిళకు అండగా..

AP | నిరుపేద మహిళకు అండగా..

AP, మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి మండలం మోపిదేవి శివారు బోడగుంటలో కొల్లూరి భాగ్యం అనే నిరుపేద మహిళ నివసించే తాటాకు పూరిల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. శుక్రవారం ఆమెకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోపిదేవి శాఖ ఆధ్వర్యంలో సహాయం చేశారు. తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరనాధ్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ హెవీ టార్పాలిన్, స్టీల్ వంట సామాన్ల సెట్ అందచేశారు. ఉప సర్పంచ్, రెడ్ క్రాస్ మోపిదేవి సబ్ బ్రాంచ్ సభ్యులు కోనేరు సుందర్ సింగ్ రూ.5 వేలు, వీఆర్ఓ, రెడ్ క్రాస్ సభ్యులు జీవీ రమణ రూ.వెయ్యి ఆర్ధిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మోపిదేవి సబ్ బ్రాంచ్ చైర్మన్ యర్రంశెట్టి సుబ్బారావు, వైస్ చైర్మన్ రిమ్మనపూడి సుబ్రహ్మణ్యం, వీఆర్ఓ బొడ్డు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply