TG | కుటుంబానికి రూ.5 లక్షల సాయం…

TG | కుటుంబానికి రూ.5 లక్షల సాయం…

TG | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ బడ్జెట్‌లో భాగంగా కుటుంబాలకు బీమా రక్షణ కల్పించే కొత్త పథకాన్ని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2026-27 వార్షిక బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూ.3,24,234 కోట్ల అంచనాలతో రూపొందించినట్లు వెల్లడించారు.

సభలో మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రజల కోసం “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం”ను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల మేర బీమా కవరేజ్ లభించనుందని తెలిపారు. ఈ పథకాన్ని జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలపై కూడా ఈ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటనలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply