100 Beds | ఆధునిక పద్ధతిలో చికిత్సలు

100 Beds | ఆధునిక పద్ధతిలో చికిత్సలు
100 Beds | కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఆధునిక పద్ధతిలో చికిత్సలు అందజేస్తున్నామని ఈ రోజు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ హరికిషన్(Dr. Harikishan) వెల్లడించారు.
వరంగల్ వెజిటేబుల్ మార్కెట్ సమీపంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో ఇన్ పేషంట్స్(Inpatients) సౌకర్యార్థం 100 పడకల(100 Beds)తో ఆసుపత్రి కొనసాగుతుందని దీర్ఘకాలిక వ్యాధులకు ఆధునిక చికిత్స విధానం, అవలంబిస్తున్నామని కాళ్లు చేతులు శరీరంలో దీర్ఘకాలికతీవ్ర నొప్పులు ఉన్నట్లయితే అగ్ని కర్మ విధానం ద్వారా నొప్పులను తగ్గించే ఆధునిక వైద్య పద్ధతులు అవలంబిస్తున్నామని, పక్షవాతం బారిన పడిన వారికి ఆధునిక మందులు వాటితో పాటు ప్రతినిత్యం మసాజ్, ఫిజియోథెరపీ(Massage, Physiotherapy) చేయడం జరుగుతుందని అన్ని రకాల చికిత్సలు ఆసుపత్రిలో నిష్టానుతులైన సర్జన్స్ బృందం నిర్వహిస్తున్నారని తెలిపారు.
అర్ష మొలలు, భగీంద్రం లాంటి వ్యాధులకు శస్ర్త చికిత్స ద్వారా నిర్వహించి వ్యాధులను నయం చేయడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలో అన్ని వ్యాధుల నివారణ కొరకు స్పెషలిస్ట్ డాక్టర్లు(Specialist Doctors) ఉన్నారని, ఆసుపత్రిలో గైనకాలజిస్టులు, (మహిళా డాక్టర్లు,) చిల్డ్రన్ స్పెషలిస్టులు(Children Specialists), డయాబెటిక్ స్పెషలిస్టులు, ఐ స్పెషలిస్టులు ఉన్నారని ఆధునిక వైద్య విధానం ద్వారా అన్ని జబ్బులను నయం చేయడం జరుగుతుందని నేడు ఆయుర్వేదం ఎంతో ప్రాచుర్యం పొంది ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, ఆసుపత్రిలో అన్ని రకాల జబ్బులకు మందులు లభిస్తాయని తెలిపారు.
అలోపతి మందుల లాగా ఆయుర్వేద మందులు లేటెస్ట్ గా స్టిప్స్ రూపేనా, లభిస్తుందని మందులను గతంలో పొడి గోలీల రూపేనా కాకుండా లేటెస్ట్ ఆధునిక ప్యాకెట్ స్టిప్స్ రూపేనా ఆయుష్ డిపార్ట్మెంట్ విభాగం తయారుచేసి మందులు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్ కు రుచికరమైన పౌష్టికాహారం కలిగిన డైట్ (భోజనం)ప్రతినిత్యం కోడిగుడ్డు, అరటిపండు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయుర్వేద వైద్యాన్ని సద్వినియోగం చేసుకొని సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని అన్నారు.

