Jannaram జన్నారం ఎంఈఓ నియామకం

Jannaram జన్నారం ఎంఈఓ నియామకం

  • ఇన్చార్జి ఎంఈఓగా బి. రాజేందర్ నియామకం

జన్నారం (Jannaram), ఆంధ్రప్రభ:
మంచిర్యాల జిల్లా జన్నారం మండల ఇన్చార్జి ఎంఈఓగా బి. రాజేందర్‌ను నియమిస్తూ వరంగల్ ఆర్జేడీ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇంతకుముందు స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం నడిమెట్ల విజయ్ కుమార్ ఇన్చార్జి ఎంఈఓగా విధులు నిర్వహించారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆయన ఆ బాధ్యతలు కొనసాగించలేనని ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా తెలియజేశారు.

దీంతో వరంగల్ ఆర్జేడీ పి. మదన్మోహన్, ఇందనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీజీహెచ్ఎం బి. రాజేందర్‌ను ఇన్చార్జి ఎంఈఓగా నియమించారు. కొత్తగా నియమితులైన బి. రాజేందర్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.