సర్ ఇంటింటి సర్వేకు అందరూ సహకరించాలి
సిర్పూర్ (యు) ఆంధ్రప్రభ : సర్ ఓటర్ జాబితా సవరణ సర్వే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు )మండలంలోని మహాగాన్ సర్పంచ్ సెడమకి జానే రావు అన్నారు.
శుక్రవారం పంచాయతీలోని అల్లిగూడ గ్రామంలో శుక్రవారం జరిగిన సర్ కార్యక్రమం సర్వేలో ఆయన పాల్గొని ప్రజలకు సర్వేపై ఓటర్ సవరణ వివరాలను అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటర్ జాబితాలో నమోదు కోసమే ఈ సర్వే చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సర్వేలో బిఎల్ఓ,నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
