వాడవాడలో మేడే ఉత్సవాలను నిర్వహించాలి

వాడవాడలో మేడే ఉత్సవాలను నిర్వహించాలి
చిట్యాల, ఆంధ్రప్రభ: ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ను వాడవాడలా ఘనంగా నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జి జీవిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య లు తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక కా, మేకల లింగయ్య స్మారక భవనంలో జరిగిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరశిస్తూ గ్రామ గ్రామాల్లో ప్రదర్శనలు,సభలు, జంఢావిష్కరణ లు చేపట్టనున్నారని అన్నారు. పోరాడి సాధించిన కార్మిక, కర్షక చట్టాలను తుంగలో తొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు .ప్రతి కార్యకర్తలు మేడే వేడుకలలో పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. అరూరి శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు ఐతరాజు నర్సింహా, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, కల్లూరి కుమార స్వామి, కందగట్ల గణేష్, మెట్టు నర్సింహా, అక్కెనపల్లి నాగయ్య, పాలమాకుల అర్జున్, కోనేటి రాములు, ఐతరాజు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
