ప్రజా ఆశీర్వాదమే కొండంత అండ
ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట మే 4 (ఆంధ్రప్రభ) : మండలం సైదాపురం గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు సమర్పించి రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని, ఆలేరు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి సాధించాలని ప్రార్థించారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువత, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని ఆలయాలో భక్తిరసంతో పూజలు నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇండ్ల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.“ప్రజల ఆశీర్వాదాలే నాకు బలం… ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడం నా బాధ్యత” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ప్రజల సంక్షేమం, గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.
