ఎస్‌ఐను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్‌ఎస్ నాయకులు

ఎస్‌ఐను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్‌ఎస్ నాయకులు

నర్సింహులపేట, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన వెంకన్నను సోమవారం మండల బీఆర్‌ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐని కలిసిన నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు గూగులోత్ లక్పతి, భూక్య రమేష్ ఎస్‌ఐ వెంకన్నను శాలువాతో ఘనంగా సన్మానించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

సన్మానం అనంతరం ఎస్‌ఐ వెంకన్న మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. నేరాల నియంత్రణలోనూ, శాంతియుత వాతావరణం నెలకొల్పడంలోనూ ప్రజాప్రతినిధులు, ప్రజలు పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.

Leave a Reply