జడ్చర్లలో సీఎం బహిరంగ సభకు సర్వం సిద్ధం..
పాలమూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టుల బాటలో భాగంగా నేడు సాయంత్రం జడ్చర్ల నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గంగాపూర్ రోడ్లో భారీ ప్రజాసభకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకరోజు ముందుగానే శరవేగంగా పూర్తయిన సభా ప్రాంగణ ఏర్పాట్లు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా వేలాదిగా తరలిరానున్న ప్రజలకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పర్యవేక్షణలో సభను విజయవంతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీక్యాడర్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది.భద్రత, పార్కింగ్, తాగునీటి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిపెట్టారు. నియోజకవర్గంలో నిర్వహించే భారీ చరిత్రాత్మక సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణుల విస్తృత సన్నాహాలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పార్టీ ప్రముఖులు తదితరులు పాల్గొన ఉన్నారు.
