యువత సామాజిక బాధ్యతలు తెలుసుకోవాలి…
యువత సామాజిక బాధ్యతలు తెలుసుకోవాలి…
ప్రిన్సిపాల్ రవి పరంగి
అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బల్మూరు మండలం, కొండనాగుల గ్రామంలోని శ్రీ ఉమా మహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలను కొండానాగుల సర్పంచ్ కాట్రావత్ పద్మ, కళాశాల ప్రిన్సిపాల్ రవి పరంగి ఘనంగా ప్రారంభించారు. అనంతరం కళాశాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రవి పరంగి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సామాజిక బాధ్యతలపై కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
విద్యా వారోత్సవాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సేవా భావం, సమాజంపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నర్సింహ, వార్డు సభ్యులు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె. అశోక్ కుమార్, ప్రోగ్రాం ఇంచార్జీలు డాక్టర్ వెంకటయ్య, డాక్టర్ లక్ష్మ గౌడ్ పాల్గొన్నారు. అలాగే అధ్యాపకులు డాక్టర్ దూప్ సింగ్, బి. జాన్ బాబు, డాక్టర్ శివకుమార్, కిరణ్ కుమార్, గాయత్రి, గోపాల్, శంకర్ వెంకటస్వామి పాల్గొన్నారు.
అధ్యాపకేతర సిబ్బందిలో సీనియర్ అసిస్టెంట్ వి. నర్సింహారావు, జూనియర్ అసిస్టెంట్ ఎస్. ఆనంద్, రికార్డు అసిస్టెంట్ నర్సింహులు, శివమ్మ, ఫర్జానా, లలిత, చంద్ బీ, రేణుక, ఆంజనేయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
