తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభః తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకల ఆకాంక్ష స్వరాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చిన గొప్ప పార్టీ బీఆర్ఎస్ అని కారేపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాధర్ అన్నారు. సుదీర్ఘంగా అలుపెరుగని పోరాటం ద్వారా తీసుకువచ్చి తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన గులాబీ జెండా నాలుగున్నర కోట్ల ప్రజల ప్రతీకగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని కారేపల్లి గ్రామ పంచాయతీ సమీపంలో ఆయన పార్టీ నాయకులతో కలిసి గులాబీ జెండా ఎగరవేసి బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ.. అలుపెరుగని పోరాటంతో స్వరాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన జెండా గులాబీ జెండా అని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 27 తెలంగాణ ఆత్మగౌరవ ప్రత్యేకంగా గులాబీ జెండా ఎగరవేసిన చారిత్రాత్మక రోజు అని ఆయన అన్నారు. త్యాగాల పునాదులపై పుట్టిన బీఆర్ఎస్ సబ్బండ వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ అభివృద్ధిలో సంక్షేమంలో దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో అద్భుతమైన ప్రగతి ఫలాలను అందించిన పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఉద్యమ యోధుడు కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పోరాటమే లేకపోతే తెలంగాణ ఎక్కడ వచ్చేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజల అస్తిత్వాన్ని కాపాడేందుకు ఆంధ్ర పాలకుల పెత్తనం తొలగించేందుకు చావు అంచుల దాకా వెళ్ళిన యోధుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ప్రతిక బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనమే ధ్యేయంగా ఏర్పాటు అయిన పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన అనంతరము పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీ పాలన నిదర్శనమైన చరిత్ర అన్నారు.

అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే తిరిగి పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉందని అందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను అన్నిటిని గ్రామీణ స్థాయిలోని ప్రజలకు తెలియజేశాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులు మహిళలు సమస్యల పట్ల ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రతి కార్యకర్త తెలియ జేయాలని సూచించారు. భవిష్యత్తులో పార్టీ ఏ ఆదేశం ఇస్తే దానికి కట్టుబడి పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో తిరిగి కెసిఆర్ ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తిరిగి కెసిఆర్ ప్రభుత్వమే రావడం ఖాయం అనే ఆలోచనలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని వారందరి ఆలోచన మేరకు ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండలంలోని ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాసు ,బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మూడవత్ గంగాధర్, సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వెంకట్ రామ్, బి.రాజు, కిషన్ దాస్,రెడ్డి, బీమా, సురేష్ రాముల వెంకటేష్, గంగాధర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు