మిన్నంటిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

మిన్నంటిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జుక్కల్ మండలవ్యాప్తంగా పార్టీ శ్రేణులు గులాబీ పండుగను ఘనంగా నిర్వహించాయి. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పార్టీ జెండాలు రెపరెపలాడాయి. మండలంలోని కేంరాజ్ కల్లాలి, డోన్గావ్, హంగార్గా, పెద్ద ఎడ్గి తదితర గ్రామాలలో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పార్టీ జెండాను ఆవిష్కరించి, మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.

కేంరాజ్ కల్లాలిలో మాజీ సర్పంచ్ సుంకరి వెంకటి, డోన్గావ్‌లో సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ జెండా ఎగురవేసిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోందని వారు విమర్శించారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు అసహనంతో ఉన్నారని, రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారాన్ని చేపట్టడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, పార్టీ శ్రేణులు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply