దుర్గమ్మ ఆలయానికి భారీ విరాళం..

  • అన్నదానానికి రూ.1.23 లక్షల విరాళం

ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ : విజయవాడ లో ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి విజయవాడ రామలింగేశ్వరరావు నగర్ కు చెందిన నూతన్ కె. అజయ్‌కుమార్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో రూ.1,23,456 విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ను కలిసి విరాళం చెక్కును అందించారు. భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగడం అభినందనీయమని చైర్మన్ పేర్కొంటూ, దాత కుటుంబాన్ని అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కాపాడాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు అధికారులు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదు అందజేశారు.