బీజేపీ రాష్ట్ర మహిళా కార్యవర్గ కార్యదర్శిగా అర్క పుష్పలత

బీజేపీ రాష్ట్ర మహిళా కార్యవర్గ కార్యదర్శిగా అర్క పుష్పలత

ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల మాజీ జెడ్పిటిసి అర్క పుష్పలతకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళా కార్యవర్గ కార్యదర్శిగా బాధ్యతలు దక్కడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఆమె నియామకాన్ని పురస్కరించుకొని సోమవారం మండలంలోని గీనేరా గ్రామ పంచాయతీ పరిధిలోని మరకగూడ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

బీజేపీ రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలను దక్కించుకున్న పుష్పలతను గ్రామ పటేల్ , మహిళలు ఘనంగా అభినందించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఈ ప్రాంత మహిళా నాయకురాలికి రాష్ట్రస్థాయి గుర్తింపు రావడం గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ పూర్కా మనోహర్, బిజెపి సీనియర్ నాయకులు కూమ్ర కేశవ్, కుమ్ర యశోద బాయి, అర్క్ పులాబాయ్, కుమర శకుంతల బాయి, పురుకా గంగు బాయి అధిక సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply