జాతీయ కబడ్డీ రిఫరీ శ్రవణ్ యాదవ్‌కు ఘన సన్మానం

జాతీయ కబడ్డీ రిఫరీ శ్రవణ్ యాదవ్‌కు ఘన సన్మానం
నిజామాబాద్ స్పోర్ట్స్,(ఆంధ్రప్రభ) : ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లాకు చెందిన జాతీయ కబడ్డీ రిఫరీ శ్రవణ్ యాదవ్‌ను నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కే గంగాధర్ రెడ్డి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా , జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రవణ్ యాదవ్ రాష్ట్ర, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో న్యాయ నిర్ణేతగా సేవలందిస్తూ విశేష గుర్తింపు పొందారని కొనియాడారు. క్రీడారంగంలో ఆయన అందిస్తున్న సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె. గంగాధర్ రెడ్డి, ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ ఎన్. అంజయ్య, జిల్లా కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రాజ్‌కుమార్ పీడీ, ముప్కాల్ కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ మోతె గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ముస్కు శ్రీనివాస్, ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ కబడ్డీ కోచ్ సాయిలు పాల్గొన్నారు. సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు రాకేష్‌తో పాటు అకాడమీకి చెందిన క్రీడాకారులు, కబడ్డీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రవణ్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు
