Candle | దండేపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ.

Candle | దండేపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ.
Candle | దండేపల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లాలోని గంజాయి స్మగర్ల దాష్టికానికి గురై అసువులు బాసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్యకు దండేపల్లిలోని పద్మశాలి మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి నివాళులు అర్పించారు.
ఈసందర్భంగా దండేపల్లి బస్టాండ్ ప్రాంతంలోని కొవ్వతులతో ర్యాలీ నిర్వహించి స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
