TG | జనగణన లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

TG | జనగణన లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
TG | సిరిసిల్ల ఆంధ్రప్రభ : జనగణన 2027లో ప్రజలందరూ చురుగ్గా పాల్గొనాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే పిలుపునిచ్చారు. ఆదివారం జనగణన నమోదులో భాగంగా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో స్వీయ గణన ప్రక్రియలో పాల్గొని కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు అందరూ జనగణనలో భాగంగా తమ కుటుంబ సభ్యుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని, సరైన సమాచారం అందించడం ద్వారా సమగ్ర గణాంకాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జనగణన విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు చురుకుగా పాల్గొని బాధ్యతగా వివరాలు నమోదు చేసుకోవలని పిలుపునిచ్చారు.
