పోక్సో కేసులో ఆర్ స్ ప్రవీణ్ అత్యుత్సాహం తగ్గించుకోవాలి..

పోక్సో కేసులో ఆర్ స్ ప్రవీణ్ అత్యుత్సాహం తగ్గించుకోవాలి..
- బీజేపీ మాజీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి.
తిమ్మాపూర్, ఆంధ్రప్రభ : సమాజంలో ఉనికి కోసం ఉత్త మాటలు మాట్లాడవద్దని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బీజేపీ మాజీ అధ్యక్షులు, న్యాయవాది సుగుర్తి జగదీశ్వరాచారి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సూచించారు.బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సందర్బంగా భాధితుల కంటే ఎక్కువగా స్పందిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహార శైలి పై శుక్రవారం నాటి మీడియాప్రకటన లో పేర్కొన్నారు.ఆర్ ఎస్ ప్రవీణ్ నిజంగా భాధితుల కోసం కాకుండా కేవలం తన రాజకీయ మైలేజీ కోసమే మాట్లాడుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
తెలంగాణలో ఎంతో మంది మైనర్ బాలికలు, మహిళలు అత్యాచారానికి గురైనప్పుడు ఏ మాత్రం స్పందించని ప్రవీణ్ ఇంతలా స్పందించడంలో కారణమేందని ప్రశ్నించారు.భగీరథ్ పై నమోదైన కేసు విషయంలో వాస్తవాలు వెళ్లడయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిందని తెలినప్పటికీ,ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని మీడియా ముందు మాట్లాడటమనేది సబ్ జ్యూడిస్ మ్యాటర్ అవుతుందని తెలిసి కూడా ఇలా ప్రవర్తించడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం కాదా అని ప్రశ్నించారు.
భాధితులకు సంబందించిన ఆదారాలేమైనా ఉంటే సిట్ కు అప్పగించాలి కానీ ప్రతీరోజొక మీడియా సమావేశం నిర్వహించి, గోప్యంగా జరుగుతున్న విచారణను ప్రభావితం చేసేలా మాట్లాడటం కరెక్ట్ కాదని ప్రవీణ్ కు సూచించారు. వాస్తవాలను వెలికితీసే పోలీస్ వ్యవస్థ,న్యాయవ్యవస్థ ఉన్నప్పటికీ, సోషల్ మీడియా ద్వారా, ప్రెస్ మీట్ ల ద్వారా అవాస్తవాలను ప్రచారం చేయడం కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ నాయకులైన బండి సంజయ్ పై కక్ష సాధింపు చర్యేనని పేర్కొన్నారు.కొడుకు తప్పు చేసినట్లుగా చూపించే కేసులో తండ్రిని ముద్దాయిగా చూపాలనుకోవడమనేది వ్యక్తిగత నేర భాద్యత అనే రాజ్యాంగ సూత్రానికి విరుద్దమని అన్నారు.
విచారణ పూర్తి కాకముందే రాజకీయ తీర్పులివ్వడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు.బహుజన రాజ్యాధికారమే లక్ష్యమని రాజకీయాల్లో ప్రవేశించి, దేవుళ్లను పూజించవద్దని, అగ్రవర్ణాలతో అంటకాగరాదని తప్పుడు ప్రచారాలు చేసి బడుగు బలహీన వర్గాలకు చెందిన దళితులను, బహుజనులను విడదీసే ప్రయత్నం చేసిన చరిత్ర ప్రవీణ్ కుమార్ దని విమర్శించారు.గతంలో బీఎస్పి లో ఉన్నప్పుడు కేసీఆర్ ను, కేటీఆర్ ను తిట్టి మళ్ళీ అదే పార్టీ లో బానిస బతుకుతున్న ప్రవీణ్ కు విశ్వసనీయత లేదని అన్నారు.భగీరథ్ కేసులో ప్రవీణ్ కుమార్ అత్యుత్సాహన్ని తగ్గించుకొని రాష్ట్రం లో జరుగుతున్న ఎన్నో అన్యాయాలపై స్పందించి భాదితులకు న్యాయం చేసే మేధావి గా ఉండాలే తప్ప,బీఆర్ఎస్ పార్టీ కి బానిస గా మారొద్దని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
