డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

  • పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్

హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం అనేది యువత భవిష్యత్తుకు, కుటుంబాలను పరిరక్షించడానికి అత్యంత అవసరమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో జాగృతి పోలీస్ కళాబృందం మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్, చైన్ స్నాచింగ్,రోడ్డు ప్రమాదాలు, ర్యాగింగ్, బాల్యవివాహలు, మహిళలపై వేధింపులు సీసీ కెమెరాల ఏర్పాటు లాంటి అంశాలపై సంస్కృత కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ యువత డ్రగ్స్, గంజాయి వాడకానికి దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రవర్తనకు ఎప్పటికప్పుడు గమనిస్తూ కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. డ్రగ్స్ విక్రయించిన, సేవించిన పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.ఆన్ లైన్ బ్యాంకింగ్ తో పాటు సోషల్ మీడియా మోసాల పట్ల ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయో వివరించారు. సామాజిక రుగ్మతలు నిర్మూలించి శాస్త్రీయ దృక్పథంతో కూడిన అవగాహనతో యువత,విద్యార్థులు స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ఎల్లవేళలా ట్రాఫిక్ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని,మైనరులకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని వివరించారు.సీసీ కెమెరాలు ప్రయోజనాలు వివరిస్తూ, వీటి ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని, ఆలాగే మండలంలోని సర్పంచ్ లు సహకరించాలని తెలిపారు.అత్యవసర సమయంలో డయల్ 100 ప్రాముఖ్యతపై ప్రతిఒక్కరికీ తెలిసి ఉండాలని సూచించారు.సెంట్రల్ జోన్ డిసీపీ దార కవిత మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన,మహిళల రక్షణ కోసం షీ టీం పనిచేస్తున్నాయని వివరించారు.

మహిళలు చట్టాల పట్ల అవగాహన ఉండాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో పోలీసుల సహాయం కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అనంతరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలు, కళాశాలో ఇంటర్మీడియట్ పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పోలీస్ కమిషనర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంటిలిజెన్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, కాజీపేట ఏసీపీ పింగిళీ ప్రశాంత్ రెడ్డి,స్థానిక సీఐ ఎ హేందర్,ఎస్సైలు దేవేందర్, శీలం రవికుమార్, గోవర్ధన్, వైద్యులు ప్రహసిత్, ప్రశాంత్, సామాజికవేత్త ఆచార్య,మండల సర్పంచ్ లు, ప్రజలు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply