ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం
ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలంలోని పెద్దమ్మ కండి తండా గ్రామపంచాయతీలో శుక్రవారం జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామా సర్పంచ్ భూక్య రమేష్ మాట్లాడుతూ… ముందుగా గ్రామ ప్రజలకు, అధికారులకు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామలే దేశానికి పట్టుకొమ్మలని, ప్రజాస్వామ్యానికి గ్రామ పంచాయతీ పునాది వంటిదని, ఈవ్యవస్థ బలంగా ఉన్నపుడే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు.
అనంతరం గ్రామ అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే గ్రామాభివృద్ధి కోసం సలహాలు, సూచనలు చేస్తూ అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మన గ్రామ ప్రజాలందరిపై ఉందని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయత్ కార్యదర్శి మమత, గ్రామ ఉప సర్పంచ్ గణపతి వార్డ్ మెంబర్ సునీత, సరిత, కారోబార్ తిరుపతి అటెండర్ ముఖ్య కూలీ, వాటర్ మాన్ రామచందర్, వీడీసీ సభ్యులు, అంగన్వాడి టీచర్ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
