బీజేపీ సంస్థాగత కార్యక్రమాలపై చర్చ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: ఇబ్రహీంపట్నం రూరల్ మండల బీజేపీ సర్వసభ్య సమావేశం చిలుకూరు గ్రామంలో మండల ఉపాధ్యక్షులు వెనిగళ్ల రాజశ్రీ శ్రీహరి స్వగృహంలో మండల అధ్యక్షురాలు పయ్యావుల జయలక్ష్మి రాము అధ్యక్షతన గురువారం నిర్వహించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రేగళ్ల రఘునాథరెడ్డి హాజరై మాట్లాడారు. మండల పరిధిలోని బీజేపీ కార్యకర్తలు, రాష్ట్ర, జిల్లా, మండల పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశంలో నాయకులు పయ్యావుల రాము, గణపతి, సత్యనారాయణ, శివప్రసాదరావు, శ్రీనివాసులు, గోపాలకృష్ణ, నరసింహారావు, శ్రీనివాసరావు, బ్రహ్మం, నాగబ్రహ్మం, హరిబాబు, అనిల్, చిట్టి, ఈశ్వర్, చిన్నా, నాగ కిశోర్ బాబు, సాంబశివరావు, రాయప్ప, రమేష్, శివ కిశోర్ బాబు, నివాస్, శ్రీరాములు, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
