రూ.1.57 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ..

  • కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలో రూ.1.57 కోట్ల (రూ.1,57,85,000) వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం మార్కెట్ కమిటీ సభ్యులు భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య మాట్లాడుతూ, తాము బాధ్యతలు చేపట్టిన అనంతరం మార్కెట్ యార్డు అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి చొరవతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.

మార్కెట్ కార్యాలయ భవనంపై మీటింగ్ హాల్, చైర్మన్ చాంబర్ నిర్మాణానికి రూ.36 లక్షలు, మార్కెట్ యార్డులో రెండు కవర్ షెడ్ల నిర్మాణానికి రూ.56.85 లక్షలు, యార్డు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.65 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, డైరెక్టర్లు మహిపాల్, లింగారెడ్డి, నవీద్, రంజిత్, జిల్లా నాయకుడు సుంకెట రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భాస్కర్, నాయకులు సల్లూరి గణేష్, సింగిరెడ్డి శేఖర్, బుచ్చి మల్లయ్య, నిమ్మ ప్రసాద్, పూజారి శేఖర్, చిన్న గంగారాం, జగదీష్, అరవింద్, మారయ్య, కాంట్రాక్టర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.