ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వామి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ పట్టణంలోని రెండో వార్డులో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు మంజూరైన గోదావరి ఇంటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొదిరే స్వామి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కౌన్సిలర్ తో కలిసి భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడం లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సంటి లత (నర్సయ్య,) రెండో వార్డ్ కౌన్సిలర్ పర్స కుశలత (అనంతరావు,) వార్డ్ ఆఫీసర్ సంతోష్, వార్డు సభ్యులు స్థానిక ప్రజలు లబ్దిదారిణి గోదావరి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
