పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలి.

పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలి.

బిక్కనూర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సభ్యులు చెప్పారు. బిక్కనూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన నాగన్ననరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా షబ్బీర్ అల్లిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డిని ఆయన అభినందించారు.

అనంతరం సభ్యులు మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందే విధంగా చూడాలన్నారు. అన్ని గ్రామాలలో నూతన కమిటీల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పార్టీలో కష్టపడిన వారికి తగిన పదవులు వస్తాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పార్టీ అధిష్టానం కల్పించిన పదవులకు తగిన న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని చెప్పారు.

గ్రామాలలో ఇల్లు లేకుండా గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యే విధంగా చూడవలసిన బాధ్యత పార్టీ నాయకుల పై ఎంతైనా ఉందన్నారు. ప్రతి సంక్షేమ పథకం పేదలకు అందించవలసిన బాధ్యత పార్టీ నాయకులు కార్యకర్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, సిద్ధిరామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ లింబాద్రి, మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకన్న బాగారెడ్డి, పెద్ద మల్లారెడ్డి, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇటిక్యాల బాగారెడ్డి, పలువురు నాయకులు ఉన్నారు.