దేశాయి నిస్వార్థ సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం
దేశాయి నిస్వార్థ సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం
- ఆపదలో అండగా నిలిచే నాయకుడు
- డోంగ్లీ మండల కాంగ్రెస్ సారథి గజానంద్ దేశాయి
డోంగ్లీ, ఆంధ్రప్రభ ; నాయకుడు అంటే అధికారం కాదు, బాధ్యత” అని నిరూపిస్తున్న వ్యక్తి డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయి వీరి నిస్వార్థ సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం తిరిగి మండల పార్టీ పగ్గాలు అప్పగించింది.
•వరదల్లో ముందున్న సైనికుడు
ఇటీవల 2025 లో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగం స్పందించే లోపే గజానంద్ దేశాయి క్షేత్రస్థాయిలోకి దిగారు.బాధిత కుటుంబాలను స్వయంగా డోంగ్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి, అక్కడే మకాం వేసి వారి బాగోగులు చూసుకున్నారు,సబ్ కలెక్టర్ కిరణ్మయి పునరావాస కేంద్రాన్ని సందర్శించినప్పుడు, గజానంద్ దేశాయి వారితో కలిసి ప్రతి బాధితుడిని పలకరించి,భోజనం,మంచినీరు, వైద్య సదుపాయాలు అందుతున్నాయో లేదో స్వయంగా పరిశీలించారు,ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారి ఆదేశాలతో,వాళ్లకు సురక్షితం ఇంటికి చేర్చే వరకు వాళ్ళతో ఉండి బాధ్యత వహించారు
•ఎల్లవేళల అందుబాటులో ఉండే నేత
వర్షాలు, వరదలే కాదు, రైతుల పంట కొనుగోలు సమస్య అయినా,రేషన్ కార్డు,ప్రజా ఆరోగ్య సమస్య అయినా, కార్యకర్తకు కష్టం వచ్చినా మొదట గుర్తొచ్చే పేరు గజానంద్ దేశాయి.జొన్న, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం రైతులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు దృష్టి కి తీసుకెళ్ళి పంట కొనుగోలు విషయంలో ప్రత్యేక కృషి చేస్తున్నారు
•కార్యకర్తలే బలం,కుటుంబమే పార్టీ
ప్రతి ఒక్క కార్యకర్త నా కుటుంబ సభ్యుడే. వారి కష్టం నా కష్టం అంటారు దేశాయి.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సహకారంతో కార్యకర్తలను కలుపుకొని పోయి పార్టీని బలపరుస్తున్నారు.మండలంలోని ప్రతి గ్రామంలో బూత్ కమిటీలను పటిష్టం చేసి,యువకులను,మహిళలను పెద్ద ఎత్తున పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా స్పందించి,తానే స్వయంగా అధికారుల దగ్గరకు వెళ్లి సమస్య పరిష్కారం అయ్యేవరకు వెంట ఉంటారు.ఫలితంగా డోంగ్లీ మండలంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ రోజురోజుకూ బలపడుతోంది. విభేదాలు లేకుండా అందరినీ సమన్వయం చేసుకొని,పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు.
•అధిష్టానం నమ్మకం
ప్రజల్లో, కార్యకర్తల్లో మంచి పేరు ఉండటం, క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేయడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం ప్రజా సమస్యలపై పోరాడిన చరిత్ర ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం మరోసారి ఆయనపైనే నమ్మకం ఉంచింది.
•మండలవాసుల మాట
అర్ధరాత్రి ఫోన్ చేసినా పలుకుతారు. అధికారి దగ్గరకు మాతో పాటు వస్తారు. ఇలాంటి నాయకుడు మాకు దొరకడం అదృష్టం అని ప్రజలు చెబుతున్నారు.
